ఛీ.. రూంలో భర్తను బంధించి 5 గంటలపాటు ఆ పని చేసిన భార్య.. తీవ్రంగా రక్తం కారడంతో..

by S Gopi |   (  Updated:2022-03-15 05:28:23  IST  )

దిశ, వెబ్ డెస్క్: విహార యాత్రకు తీసుకెళ్లలేదని తన భర్తను సోదరుడితో..wife beat up her husband for refusing to move to delhi

ఛీ.. రూంలో భర్తను బంధించి 5 గంటలపాటు ఆ పని చేసిన భార్య.. తీవ్రంగా రక్తం కారడంతో..
X

దిశ, వెబ్ డెస్క్: విహార యాత్రకు తీసుకెళ్లలేదని తన భర్తను సోదరుడితో కలిసి రూంలో చితకబాదింది ఓ భార్య. అతను అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి 13 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. అతడికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఉద్యోగ రీత్యా భార్యకు దూరంగా ఉంటున్న అతను సెలవుల్లో ఇంటికి వచ్చాడు. విహార యాత్ర కోసం తనని, పిల్లలను ఢిల్లీకి తీసుకెళ్లమని భార్య కోరింది. దీంతో అతను డబ్బులు లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆమె ఆగ్రహంతో తన సోదరుడికి ఫోన్ చేసి పిలిపుంచుకుంది. అనంతరం వారిద్దరూ కలిసి భర్తను ఓ రూంలో బంధించి 5 గంటలపాటు దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. బాధితుడు అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story