వాయిదా పడ్డ 'జన గణ మన'.. అసలు కారణం అదే..??

by Dishafeatures2 |
వాయిదా పడ్డ జన గణ మన.. అసలు కారణం అదే..??
X

దిశ, వెబ్‌డెస్క్: పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన' మూవీ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్. ఈ మూవీ మొదలైందని స్వయంగా పూరి చెప్పినప్పటి నుంచి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సినిమా అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలో ఈ సినిమా వాయిదా పడిందని, ఈ సినిమా కన్నా ముందు విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. శివ నిర్వాణ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది.

అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్‌కి హీరోయిన్‌గా సమంత నటించనుంది.అయితే పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌‌ను విదేశాల్లో చిత్రీకరించాలని చూస్తున్నాడు. అందుకోసం ఈ సినిమా లొకేషన్స్ కోసం పూరి టీమ్ ఆస్ట్రేలియాలో తిరుగుతోంది. దీంతో పూరి టీం లొకేషన్స్ ఓకే చేయడానికి, వాటికి కావలసిన పర్మిషన్స్, విసాలు రావడానికి చాలా సమయం పడుతుందని, అందుకే విజయ్ తన నెక్స్ట్‌ను మొదలెట్టనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి దీనిపై విజయ్ త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Next Story

Most Viewed