'విస్కీ'కే జై కొడుతున్న మద్యం ప్రియులు

by Muthe.Rajitha |

తెలంగాణ మద్యం అమ్మకాల్లో తెలంగాణలో మందుబాబులు ఎక్కువగా తాగుతోంది విస్కీ అని గణాంకాలు చెబుతున్నాయి.

విస్కీకే జై కొడుతున్న మద్యం ప్రియులు
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోనే అత్యధికంగా మద్యం అమ్ముడవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణలో మందుబాబుల అసలు సిసలైన ఇష్టం ఏంటో తాజా గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో విక్రయమయ్యే ఐఎంఎఫ్ఎల్ (Indian Made Foreign Liquor) మార్కెట్‌లో 'విస్కీ' రకానిదే ఏకఛత్రాధిపత్యంగా సాగుతోంది. తెలంగాణలో అమ్ముడవుతున్న ప్రతి 10 లిక్కర్ బాటిళ్లలో 9 బాటిళ్లు కేవలం విస్కీవే ఉంటుండటం విశేషం. దీనిని బట్టి ఇక్కడి మద్యం ప్రియులు విస్కీ బాటిళ్లను ఏ స్థాయిలో ఖాళీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులోనూ సాధారణ బ్రాండ్ల కంటే మీడియం, ప్రీమియం కేటగిరీ బ్రాండ్లనే కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

బ్రాందీ, వోడ్కాల వాటా ఎంతంటే?

మద్యం అమ్మకాల శాతాన్ని పరిశీలిస్తే, విస్కీ తర్వాత స్థానాన్ని 'బ్రాందీ' దక్కించుకుంది. మొత్తం అమ్మకాల్లో బ్రాందీ వాటా 9.2 శాతంగా నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా వోడ్కా 1.24 శాతం, వైన్ 0.88 శాతం, రమ్ 0.32 శాతం చొప్పున విక్రయమవుతున్నాయి. ఇక మద్యం ప్రియులు అత్యంత తక్కువగా ఇష్టపడే రకంగా 'జిన్' నిలిచింది, దీని అమ్మకాలు కేవలం 0.09 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే తెలంగాణ లిక్కర్ మార్కెట్‌ను విస్కీ ఏ రేంజ్‌లో రూల్ చేస్తోందో స్పష్టమవుతోంది.

Next Story