- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్లిమ్ గా అవడానికి ఏది బెస్ట్..? యోగా లేదా జిమ్?
స్లిమ్ గా అవడానికి, పొట్ట తగ్గడానికి ఏది బెస్ట్ ? హెవీ వర్క్ ఔట్స్ లేదా కార్డియో లేదా యోగా? తెలుసుకుందాం.

దిశ, వెబ్ డెస్క్ : స్లిమ్ కావడానికి, పొట్ట తగ్గించుకోవడానికి ఏ వ్యాయామం ఉత్తమం అనేది చాలా మందిలో ఉండే సందేహం. అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే.. కేవలం ఏదో ఒక్కటే కాకుండా, మీ శరీరం యొక్క అవసరాలను బట్టి వ్యాయామాలను సమన్వయం చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. అవేంటో చూద్దాం..
కొవ్వును కరిగించే పవర్‌హౌస్ కార్డియో..
పొట్ట తగ్గడానికి కార్డియో (Cardio) వ్యాయామాలు అత్యంత వేగవంతమైన మార్గం. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ వల్ల గుండె వేగం పెరిగి, తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అయితే, కేవలం కార్డియో మాత్రమే చేస్తే శరీరం లూజ్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దీనికి స్ట్రెంత్ ట్రైనింగ్ (Strength Training) లేదంటే వెయిట్ లిఫ్టింగ్ తోడు చేయాలి. స్ట్రెంత్ వర్కౌట్స్ చేయడం వల్ల శరీరంలో కండరాల శాతం పెరుగుతుంది. కండరాలు ఎంత ఎక్కువగా ఉంటే, మీరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా మీ శరీరం అంత ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తుంది అంటే బాడీ మెటబాలిజం పెరుగుతుంది. కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ కలిపి చేయడం వల్ల శరీరం స్లిమ్ అవడమే కాకుండా, కండరాలు బిగుతుగా మారి ఆకర్షణీయంగా కనిపిస్తారు.
యోగా.. దీర్ఘకాలిక ఫిట్‌నెస్
మీరు జిమ్‌లో హెవీ వర్కౌట్స్ చేయలేకపోతే, యోగా(Yoga) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. యోగాలో ఉండే సూర్య నమస్కారాలు, ధనురాసనం, నౌకాసనం వంటివి పొట్ట కండరాలపై ఒత్తిడిని కలిగించి, అక్కడి కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. యోగా వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒత్తిడి పెరిగితే శరీరంలో 'కార్టిసోల్' అనే హార్మోన్ విడుదలయ్యి, పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆకృతి కూడా మెరుగుపడుతుంది.
ఏది బెస్ట్?
కేవలం ఒక్క విభాగంపైనే కాకుండా, అన్నింటినీ కలిపి ఒక పద్ధతిలో చేయడం వల్ల కోరుకున్న ఫలితాన్ని పొందవచ్చు. అవన్నీ ఈ పద్దతిలో చేయండి..
*హెవీ వర్కౌట్స్ : మీకు జిమ్ అలవాటు ఉంటే, వారానికి 3-4 రోజులు హెవీ వెయిట్స్ తో పాటు 'కాంపౌండ్ మూవ్‌మెంట్స్' (Squats, Deadlifts) చేయడం వల్ల పొట్ట త్వరగా తగ్గుతుంది.
*కార్డియో : రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్ చేయడం తప్పనిసరి.
*యోగా: వారానికి 1 లేదా 2 రోజులు యోగా, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గి, శరీరం రిలాక్స్ అవుతుంది.
*డైట్ : శరీరం ఫిట్ గా ఉండాలంటే ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు ఎంత వర్కౌట్ చేసినా, మీరు తీసుకునే ఆహారం (Calories) నియంత్రణలో లేకపోతే ఫలితం ఉండదని, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని పోషకార నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని వారాల్లోనే అత్యుత్తమ ఫలితాలు పొందాలనుకుంటే కార్డియో + స్ట్రెంత్ ట్రైనింగ్ బెస్ట్ అంటున్నారు వ్యాయామ నిపుణులు. కానీ, జీవితాంతం ఫిట్‌గా ఉండాలనుకుంటే వారంలో యోగాతో సహా అన్ని రకాల వ్యాయామాలను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటితోపాటు డైట్ కూడా తప్పనిసరి పాటిస్తేనే అనుకున్న ఫిట్నెస్ లక్ష్యాలను చేరగలరని చెబుతున్నారు.






