మేం చేసిన పాపం ఏంటి..? ఆదర్శ రైతుల గగ్గోలు

by Malleboina Mahesh |

దిశ, తుంగతుర్తి: ఆదర్శ రైతులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి latest telugu news..

మేం చేసిన పాపం ఏంటి..? ఆదర్శ రైతుల గగ్గోలు
X

దిశ, తుంగతుర్తి: ఆదర్శ రైతులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కసర బోయిన లింగయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన ఆ సంఘం నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో 250 మంది రైతులకు ఒక ఆదర్శ రైతును నియామకం చేసిందని అన్నారు. నాటి నుంచి రైతులకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఈ వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆదర్శ రైతులను తొలగించి వీరి స్థానంలో ఏఈఓ లను నియమించారని వివరించారు. ఆదర్శ రైతులు ఏం పాపం చేశారంటూ.. సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకున్న విధంగా ఆదర్శ రైతు వ్యవస్థని కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఆదర్శ రైతులు ఇరుగు సైదులు, ప్రసాద్, ప్రవీణ్ రెడ్డి, యాదగిరి, శేఖర్, సుదర్శన్ హమ్మద్ మల్సూర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story