ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఆవు.. చివరికి ఏం జరిగిందంటే?

by Jakkula.Mamatha |

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ప్రమాదవశాత్తు ఆవు బావిలో పడిన సంఘటన చోటు చేసుకుంది.

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ ఆవు.. చివరికి ఏం జరిగిందంటే?
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ప్రమాదవశాత్తు ఆవు బావిలో పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం కాలేజ్ రోడ్డులో సుమారు 200 అడుగుల లోతైన బావిలో ప్రమాదవశాత్తు ఆవు పడిపోయింది. గమనించిన స్థానికులు కార్పొరేటర్ కస్తూరి నాగరాజుకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శాఖ, రెస్క్యూ టీంకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక, రెస్క్యూ టీం సిబ్బందిని అధికారులు అభినందించారు.

Next Story