- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంధువుల ఇంటికి వెళ్లిన వివాహిత.. ఆ స్థితికి ఆమెను చూసి..
by Manoj |
దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని కే లక్ష్మీపురం గ్రామంలో ఓ..latest telugu news

X
దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని కే లక్ష్మీపురం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ మేరకు ఎస్ఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం బత్తుల నాగారం గ్రామానికి చెందిన ఉయిక రాజేశ్వరి(28) అనే వివాహిత ఇటీవల కే లక్ష్మీపురం గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాల కారణంగా పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో.. గమనించిన బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆరోగ్యం విషమించి ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






