ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటాం

by Bhoopathi Nagaiah |

రాష్ట్రంలో ఉద్యమకారులందరీని బీజేపీ అక్కున చేర్చుకొని అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటాం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యమకారులందరీని బీజేపీ అక్కున చేర్చుకొని అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాష్ట్రఅధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డిలు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ప్రభుత్వంపై అసమ్మతితో ఉన్నవారందరిని బీజేపీలోకి ఆహ్వానిద్దామన్నారు. ప్రతి గ్రామంలో యువతను బీజేపీలోకి చేర్చుకోకున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, ఉద్యమకారులు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story