కొత్త కాంతులను మోసుకొచ్చే సంక్రాంతి కావాలి.. తెలుగు ప్రజలకు సీ CM రేవంత్ విషెస్

by Kema Shiva Kumar |

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త కాంతులను మోసుకొచ్చే సంక్రాంతి కావాలి.. తెలుగు ప్రజలకు సీ CM రేవంత్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, కొత్త కాంతులను మోసుకొచ్చే సంక్రాంతి పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి చేరాలనేదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులు, సామాన్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్రం కేవలం వ్యవసాయంలోనే కాకుండా.. పరిశ్రమలు, ఉత్పత్తి, సేవా రంగాల్లో కూడా తిరుగులేని పురోగతిని సాధిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌ను సాకారం చేసి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన వివరించారు. ఇక తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ప్రజలందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కోరారు. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగులు ఎగురవేసే సమయంలో పిల్లలు, పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలకు తావులేకుండా పండుగను ఆస్వాదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Next Story