నల్లమల సాగర్‌పై కోర్టుకు మా అభ్యంతరం చెప్పాం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 10:17:51  IST  )

పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టు (Polavaram-Nallamala Sagar Project)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది.

నల్లమల సాగర్‌పై కోర్టుకు మా అభ్యంతరం చెప్పాం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ వెబ్‌డెస్క్: పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టు (Polavaram-Nallamala Sagar Project)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల మధ్య ఉండే ఇలాంటి జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్ 131 కింద ‘సివిల్ సూట్’ (Civil Suit) ద్వారానే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది.

సూట్ ఫామ్‌లో రమ్మని అని కోర్టు చెప్పింది..

ఈ క్రమంలో కోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీ (Delhi)లోని సుప్రీం కోర్టు మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తుతూ రిట్ పిటిషన్ వేశామని అన్నారు. ఇదే కేసులో గత సోమవారం కూడా విచారణ జరిగిందని, నాడు ఇచ్చిన వాదనలను అదనంగా ఇవాళ మరికొన్ని వాదనలు కోర్టులో వినిపించామని తెలిపారు. ఇక్కడ కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమని అన్నారు. ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలు చేసిందని పేర్కొన్నారు. అన్నింటినీ సుప్రీం కోర్టుకు దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను కూడా అమలు చేయడం లేదనే విషయాన్ని కూడా చెప్పామన్నారు.

పోలవరం ఒరిజినల్ ఫామ్‌కు అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదు..

ఏపీకి కేటాయించిన 484.5 టీఎంసీలు.. ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తమ్ అన్నారు. ఏపీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ (Apex Council) అనుమతులు లేకుండా ముందుకెళ్తోందనే విషయాన్ని ధర్మాసనం ఎదుట వివరించామని తెలిపారు. ముందుగా డిజైన్ చేసిన దాని కంటే అదనంగా ఏమీ చేయడానికి వీల్లేదని వాదించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఒరిజినల్ ఫామ్‌కు అదనంగా మార్పులు చేయడానికి వీల్లేదని చెప్పామన్నారు. రిట్ పిటిషన్ కాకుండా సూట్ ఫామ్‌లో రావాలని కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఈ మేరకు పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని.. తెలంగాణ నీటి హక్కులను కాపాడటం కోసం ఎందాకైనా పోరాడుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు.

Read More... Harish Rao: ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఢిల్లీ వరకు వెళ్లాలా?:హరీశ్ రావు

Next Story