- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారంలో యుద్ధం ముగుస్తుంది : KA పాల్
మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వారం రోజుల్లో ఆగిపోతుందని KA పాల్ వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మధ్యప్రాచ్య యుద్ధ సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 28, 2026 నుంచి ప్రారంభమైన ఇరాన్ - ఇజ్రాయెల్ వార్ 12 రోజులుగా కొనసాగుతూ.. మిడిల్ ఈస్ట్ దేశాల్ తీవ్ర విధ్వంసం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ శాంతి కోసం తనవంతు ప్రయత్నం చేస్తూ కేఏ పాల్ నేరుగా రంగంలోకి దిగడం విశేషం.
శాంతి రాయబారిగా పాల్
కేఏ పాల్ ఇటీవల ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో పర్యటించి, అక్కడి కీలక మత పెద్ద ఆయతుల్లా అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి (Ayatollah Abdul Majeed Hakeem Ilahi) తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్న సామాన్య ప్రజలకు మానవతా సహాయం అందించేందుకు కనీసం 3 రోజుల పాటు యుద్ధాన్ని ఆపాలని ఆయన కోరారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నాయకత్వం ఈ తాత్కాలిక విరమణకు మద్దతు ఇచ్చి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందా?
KA పాల్ చెప్పినట్టు "వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుంది" అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది ఆయన శాంతి చర్చలు ఫలిస్తాయని ఊహించి చేసిన వ్యాఖ్యలు కాగా నిజానికి అధికారికంగా యుద్ధం ముగిసే సంకేతాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఏది ఏమైనా కేఏ పాల్ చేస్తున్న ఈ 'శాంతి యాత్ర' యుద్ధ విరమణ ఆశలను రేకెత్తిస్తుండగా, క్షేత్రస్థాయిలో పెంటగాన్ ప్రకటనలు మాత్రం భీతిని కలిగిస్తున్నాయి. ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్, ఆహార, ఇంధన కొరత, ఇజ్రాయెల్ తోసహా మధ్య ప్రాచ్య దేశాలపై తీవ్ర దాడుల మధ్య పాల్ చేస్తున్న 72 గంటల సీజ్‌ఫైర్ పిలుపు ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి.






