- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"సావర్కర్ కు భారతరత్న"పై మాటల యుద్ధం
RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల ఫిబ్రవరి 8న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి అనడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారాయి. మోహన్ భగవత్ వ్యాఖ్యలను RSS, BJP వర్గాలు స్వాగతిస్తే.. కాంగ్రెస్, AIMIM (MIM) వంటి ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
మోహన్ భగవత్ "100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ – న్యూ హారిజన్స్” అనే లెక్చర్ సిరీస్‌లో మాట్లాడుతూ.. "వీర సావర్కర్‌కు భారతరత్న ఇస్తే ఆ అవార్డు గౌరవం ఇంకా పెరుగుతుంది. నేను ఆ కమిటీలో లేను, కానీ ఎవరినైనా కలిస్తే ఈ విషయం అడుగుతాను. అవార్డు లేకపోయినా సావర్కర్ ఇప్పటికే కోట్లాది భారతీయుల హృదయాల్లో రాజులానే ఉన్నారు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను RSS, BJP వర్గాలు చాలా సానుకూలంగా తీసుకున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం, సావర్కర్ ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, అండమాన్ సెల్యులర్ జైలులో తీవ్ర కష్టాలు అనుభవించిన వ్యక్తి, కాబట్టి ఆయనకు భారతరత్న రావాల్సిందే అని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ నేత భాయ్ జగతప్ మాట్లాడుతూ.. "సావర్కర్ 1911, 1914, 1919లో అండమాన్ జైలులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణ ఉత్తరాలు రాశారు. భారతరత్న లాంటి అత్యున్నత అవార్డు ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి ఇవ్వాలనే డిమాండ్ అర్థం లేనిది" అని అన్నారు. MIM పార్టీ కూడా ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తోంది. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురు నేతలు సావర్కర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సావర్కర్ హిందుత్వ ఐడియాలజీకి మూలకర్త అని ముస్లింలకు వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించిన వ్యక్తి అని, అసలు ఆయన దేశానికి ఏం సేవ చేసారని భారతరత్న ఇవ్వాలో చెప్పాలని మండిపడుతున్నారు.
ఇక BJP ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "సావర్కర్ భారతరత్న కంటే పైనే ఉన్న వ్యక్తి. ఆయనకు భారతరత్న ఇస్తే ప్రతి భారతీయుడికి అది గర్వకారణమే" అని అన్నారు. ఈ వ్యవహారంపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపారు. అయితే వీర సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్స్ ఉన్నట్టే.. వ్యతిరేకిస్తున్నవారు కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు సావర్కర్ కు ఈ అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి ముందుకు రాలేదు.






