బెంగాల్ ఎన్నికలు.. లెక్కింపునకు ముందు రోడ్డుపై వీవీప్యాట్ స్లిప్పులు

by Malleboina Mahesh |

బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు వేళ కలకలం! నోపరాకు చెందిన వీవీప్యాట్ స్లిప్పులు రోడ్డుపై లభ్యం కావడంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బెంగాల్ ఎన్నికలు.. లెక్కింపునకు ముందు రోడ్డుపై వీవీప్యాట్ స్లిప్పులు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందే అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ స్ట్రాంగ్ రూమ్‌లలో వివిపాట్ లను తెరిచి ఓట్లను వేసుకుంటుందని టీఎంసీ అనేక ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సైతం టీఎంసీ ప్రచారంలో ఉచింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందే.. ఉత్తర 24 పరగణాల జిల్లాలో వీవీప్యాట్ స్లిప్పులు రోడ్డుపై కనబడటం తీవ్ర కలకలం రేగింది. నోపరా నియోజకవర్గ బూత్ నంబర్ 29కి చెందిన వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులు మధ్యమ్‌గ్రామ్ అసెంబ్లీ పరిధిలోని సుభాష్ నగర్ రోడ్లపై చెత్తాచెదారంగా పడి ఉండటం స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో ఎన్నికల నిర్వహణ తీరుపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమాచారం అందిన వెంటనే నోపరా సీపీఐ(ఎం) అభ్యర్థి గార్గి ఛటర్జీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి తృణంకూర్ భట్టాచార్జీ, బీజేపీ నుంచి అర్జున్ సింగ్ వంటి కీలక నేతలు బరిలో ఉన్న ఈ స్థానంలో, లెక్కింపునకు ఒక్క రోజు ముందే ఇలా వీవీప్యాట్ స్లిప్పులు బహిరంగంగా లభ్యం కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story