అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు: తహశీల్దార్ శ్రీకాంత్

by Batti.Sumithra |

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు.. అనర్హులైన ఓటర్ల ఏరివేత లక్ష్యంగా ఈనెల 25 నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు జాజిరెడ్డిగూడెం మండల తహశీల్దార్ శ్రీకాంత్ అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు: తహశీల్దార్ శ్రీకాంత్
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు.. అనర్హులైన ఓటర్ల ఏరివేత లక్ష్యంగా ఈనెల 25 నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు జాజిరెడ్డిగూడెం మండల తహశీల్దార్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం రామన్నగూడెం రైతు వేదికలో వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ వుల్లెందుల సైదులుతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ విజయవంతానికి బీఎల్వోలకు రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్క ఓటరుకు 2 ఎన్యుమరేషన్ ఫామ్ లను పంపిణీ చేస్తారని అన్నారు. ఓటర్లు అందులోని వివరాలను సరి చూసుకొని, మిగిలిన వివరాలను పూర్తి చేసి, ఇటీవల దిగిన ఫోటోను అంటించి సంతకం చేసి ఒక దానిని తిరిగి ఇవ్వాలని సూచించారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్ ను తిరిగి ఇవ్వకపోతే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరునమోదు చేయబడదని తెలిపారు. ఒకవేళ ఓటరుకు రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే ఏదో ఒక చోట ఓటు హక్కు ఉండేలా ముందే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిర్దావర్ పాటి వెంకటరెడ్డి, సిబ్బంది దాసరి రమేష్, సోమన్న, ఆగేష్, వివిధ పార్టీల బీఎల్ఏలు పాల్గొన్నారు.

Next Story