- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి నిర్మల్ జిల్లాలో జోరందుకున్న ఓటర్ల నమోదు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్ ( స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) నమోదు జోరందుకున్నది.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్ ( స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) నమోదు జోరందుకున్నది. తొలుత అంతంత గానే ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు, విద్యావంతులు దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం తో క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే మరో వారంలో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉండగా... తాజాగా ఎన్నికల కమిషన్ మరో 10 రోజులు పెంచడం తో చివరి తేదీ నాటికి 100% పూర్తవుతుందని అధికారులు ధీమాతో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ యంత్రాంగం తో పాటు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యాన్ని పెంచి సర్ పూర్తికి కృషి చేస్తున్నారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఫారాలు అందజేసే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్న నేపథ్యంలో పలు చోట్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బీఎల్వోలకు తాము ఇంటింటికి వెళ్లి ఫారాలు ఇచ్చినట్లు చెబుతుండగా... ఇంతవరకు తమ ఇంటికి ఎవరు రాలేదని అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి.
జోరందుకున్న సర్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే సర్ నమోదు కొంత ఆశాజనకంగానే ఉంది. ఎన్నికల కమిషన్ అధికారికంగా ఇచ్చిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు ఇటుగా సుమారు సర్ 70% పూర్తయినట్లు అంచనా. అయితే క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నాలుగు జిల్లాలోనూ బిఎల్వోలు ఎలక్ట్రోరల్ ఫారాలు 100% పంపిణీ చేసినట్లు ఎన్నికల కమిషన్ స్టేటస్ చెబుతున్నది. వాస్తవానికి అనేక కుటుంబాలకు ఫారాలు అందలేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 4,55,596 మంది ఉండగా మూడు లక్షల 52290 ఓటరు ఫారాలు డిజిటలైజేషన్ అయినట్లు చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఆరు లక్షల 61 వేల 467 మంది ఓటర్లు ఉండగా 4,44,887 మంది ఓటర్లు డిజిటలైజేషన్ పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లక్షల 66,784 మంది ఓటర్లు ఉండగా మూడు లక్షల 37 వేల 828 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తికాగా... నిర్మల్ జిల్లాలో 755344 మంది ఓటర్లకు గాను 568064 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ స్టేటస్ చెబుతున్నది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70% పూర్తయినట్లు అంచనా వేస్తున్నారు.
బీఎల్ఓల పై ఫిర్యాదులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సుమారు 20 లక్షల మంది ఓటర్లు ఉండగా ప్రతి ఒక్కరికి ఫారాలు పంపిణీ చేసినట్లు బిఎల్వోలు ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా ఎలక్షన్ కమిషన్ కు సమాచారం ఇచ్చారు వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికీ అనేక కుటుంబాలకు ఫారాలు అందలేదు. మరోవైపు ఒక ఇంట్లో ఐదుగురు ఓటర్లు ఉంటే ముగ్గురికి ఫారాలు ఇచ్చి మరో ఇద్దరికి ఇవ్వని సంఘటనలు కోకొల్లలు. అయితే తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ సర్ ప్రక్రియపై దృష్టి సారించిన నేపథ్యంలో పట్టణాల్లో వార్డుల వారీగా... గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నాయకులు కార్యకర్తలకు ఇంటింటికి వెళ్లి సర్ నమోదుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నమోదు ప్రక్రియ క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల సంఘం ప్రక్రియను మరో పది రోజులు పెంచిన నేపథ్యంలో గడువులోగా 100% పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.






