Vizag: ఆచితూచి ఆడుతున్న కివీస్ బ్యాటర్లు.. 17 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-28 15:00:51  IST  )

వైజాగ్ వేదిగా జరుగుతున్న నాలుగో టీ20లో కివీస్ బ్యాటర్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు.

Vizag: ఆచితూచి ఆడుతున్న కివీస్ బ్యాటర్లు.. 17 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ (Vizag) వేదిగా జరుగుతున్న నాలుగో టీ20లో కివీస్ బ్యాటర్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా (Team India) మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజ్‌లోకి వచ్చిన న్యూజిలాండ్ (New Zealand) ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే మొదటి నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. టిమ్ సీఫెర్ట్ కేవలం 36 బంతుల్లో 62 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తోడుగా డెవాన్ కాన్వే 23 బంతుల్లోనే 44 పరుగులు సాధించి బలమైన పునాది వేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కుల్దీప్ మాయ..

ఈ క్రమంలోనే ప్రమాదకరంగా మారుతున్న ఆ జోడీని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) విడదీశాడు. కుల్దీప్ తన 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ పడగొట్టి కివీస్ స్కోరు వేగానికి బ్రేకులు వేశాడు. మరోవైపు యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా తన 2 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి రచిన్ రవీంద్రను పెవిలియన్ పంపాడు. అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు. న్యూజిలాండ్ 17 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (11), జకారి ఫోక్స్ (1) పరగుతో క్రీజ్‌లో ఉన్నారు.

Next Story