ఫరియాపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్.. అంత మాట అనేశాడేంటి!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-31 05:24:53  IST  )

‘పరేశాన్’, ‘మసూద్’, ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్’ సినిమాలతో వరుస హిట్లు కొట్టి ఫామ్‌లో ఉన్న హీరో తిరువీర్(Thiruveer), ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంతుడు’.

ఫరియాపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్.. అంత మాట అనేశాడేంటి!
X

దిశ, సినిమా: ‘పరేశాన్’, ‘మసూద్’, ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్’ సినిమాలతో వరుస హిట్లు కొట్టి ఫామ్‌లో ఉన్న హీరో తిరువీర్(Thiruveer), ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంతుడు’. జీజీ విహరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవి పనస ఫిల్మ్స్ కార్పొరేషన్ నిర్మిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. “తిరువీర్ నా ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో హీరోగా చేయాల్సిన వాడు, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు” అని విశ్వక్ సేన్ అన్నారు. ఇక ఫరియా గురించి మాట్లాడుతూ “సీజీ, గ్రాఫిక్స్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిన తర్వాత ఆమెతో సినిమా చేయాలని ఆగుతున్నా” అంటూ జోక్ వేశాడు. సరదాగా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం “అయ్యో అన్నా… జోక్ అయినా అంత మాట అనేశావేంటి.. కాస్త ఓవర్ అయింది కదా!”అని నెటిజన్లు రచ్చ చేస్తున్నారు

Read More..

పాపను ఎత్తుకొని కనిపించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్

Next Story