Vishnuvardhan Reddy: కాంగ్రెస్‌లో తాము పట్టాదారులం.. విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   (  Updated:2022-07-05 07:29:34  IST  )

Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders To Lunch| కాంగ్రెస్ పార్టీ సమావేశంపై పార్టీ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ నేతలతో గ్యాప్ వచ్చిందని, ఇక సీనియర్లందరినీ రోజూ కలుస్తుంటానని అన్నారు.

Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders To Lunch
X

దిశ, వెబ్‌డెస్క్: Vishnuvardhan Reddy Invites Congress Senior Leaders To Lunch| కాంగ్రెస్ పార్టీ సమావేశంపై పార్టీ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ నేతలతో గ్యాప్ వచ్చిందని, ఇక సీనియర్లందరినీ రోజూ కలుస్తుంటానని అన్నారు. లంచ్‌కు పిలిచింది కూడా గ్యాప్ పూడ్చడానికే అని తేల్చి చెప్పారు. సమావేశానికి మాజీ ఎంపీలు వీ.హనుమంత రావు, మధుయాష్కీలు వస్తామని చెప్పినట్లు తెలిపారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఢిల్లీలో ఉన్న కారణంగా లంచ్‌కు పిలవలేదని, వీలైతే ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి భట్టి వస్తారని అన్నారు. పార్టీలో ఎవరు చేరినా లాభమే అని కానీ, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాము పట్టాదారులమని, చచ్చేవరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story