సెహ్వాగ్ విధ్వంసానికి 19 ఏళ్లు.. ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డు

by Disha Web Desk 2 |
సెహ్వాగ్ విధ్వంసానికి 19 ఏళ్లు.. ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: సెహ్వాగ్.. ఈ పేరు వినగానే బౌలర్ల గుండెళ్లో రైళ్లు పరిగెడుతాయి. ఫార్మాట్ ఏదైనా సరే మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ క్రీడాభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతాడు. టెస్టు మ్యాచులో సైతం ఫస్ట్ బాల్ నుంచే బౌండరీలు బాదుతూ బౌలర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఇలాంటి దూకుడుతోనే సరిగ్గా 19 ఏళ్ల క్రితం వీరుభాయ్ చరిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ట్రిపుల్ సెంచ‌రీ కొట్టి ఈరోజుతో 19 ఏళ్లు పూర్తవుతుంది. పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదిక‌గా ట్రిపుల్ సెంచ‌రీ కొట్టిన సెహ్వాగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల త‌ర్వాత సెహ్వాగ్‌ సరిగ్గా ఇదే రోజున మ‌ళ్లీ ట్రిపుల్ సెంచ‌రీ మార్క్ అందుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఒక‌టి కంటే ఎక్కువ ట్రిపుల్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో సెహ్వాగ్ చేరాడు.

ఆ మ్యాచ్‌లో 295 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఎలాంటి భయం లేకుండా సిక్సు కొట్టి సెహ్వాగ్ ట్రిపుల్ సెంచ‌రీ పూర్తి చేసుకోవ‌డం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులనే కాక, క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెహ్వాగ్ మొత్తంగా 375 బంతులు ఎదుర్కొని 82 స్ట్రైక్‌రేట్‌తో 309 ప‌రుగులు చేశాడు. ఇందులో 39 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. సెహ్వాగ్ ట్రిపుల్ సెంచ‌రీకి తోడు స‌చిన్ 194 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెల‌రేగ‌డంతో ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. అయితే, ఈ విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా 'అదొక స్పెషల్ డే' అంటూ గుర్తుచేసుకున్నాడు.



Next Story

Most Viewed