క్యాబ్ డ్రైవర్‌తో హీరో ఫైటింగ్.. పిచ్చోళ్లను చేశారు కదరా..

by Dishafeatures3 |
Vikrant-Massey
X

దిశ, సినిమా : '12th fail ' హీరో విక్రాంత్ మాసే క్యాబ్ డ్రైవర్ తో గొడవపడిన వీడియో లీక్ అయింది. రైడ్ బుక్ చేసినప్పుడు చూపించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బులు అడగడంతో ఈ గొడవ స్టార్ట్ అయింది. అంత ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించగా యాప్ లో అలాగే చూపిస్తుంది ఇవ్వాలని సమాధానం ఇస్తాడు డ్రైవర్. కానీ వెహికిల్ నువ్వు నడుపుతున్నావ్ కదా అంటే అంత సంపాదిస్తున్నావ్ ఇస్తే ఏంటని హీరోను ప్రశ్నిస్తాడు.

అయితే ఈ గొడవ నిజం కాదట. ఓ యాడ్ లో భాగమట. inDrive App క్యాంపెయిన్ చేస్తున్న విక్రాంత్.. క్యాబ్ చార్జీలపై అవగాహన పెంచేందుకు ఇలా చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ యాప్ కస్టమర్స్ చార్జీలు డిసైడ్ చేసుకునేలా ఉందని.. ఇందులో రైడ్స్ తో చాలా సంతృప్తిగా ఉందని తెలిపాడు. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'పిచ్చోళ్లను చేశారు కదరా నిజమే అనుకుని తెగ ఫీల్ అయిపోయాం ' అంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed