- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదే కదా అసలైన ఆనందం.. ఇంతకన్నా లగ్జరీ ఏముంది?
దిశ, ఫీచర్స్ : జీవితాన్ని వెనక్కి మళ్లించే ఛాన్స్ దొరికితే.. ఎవరైనా సరే తమ బాల్యాన్ని తిరిగి పొందేందుకు ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు.

దిశ, ఫీచర్స్ : జీవితాన్ని వెనక్కి మళ్లించే ఛాన్స్ దొరికితే.. ఎవరైనా సరే తమ బాల్యాన్ని తిరిగి పొందేందుకు ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు. అమాయకపు రోజులు.. ఒత్తిడి, కల్మషం ఎరుగని హృదయాలు, స్నేహితులతో గిల్లి కజ్జాలు, కాకి ఎంగిళ్లు, ఆటలు, పాటలు.. ఇలా బాల్యంలో గడిపిన ప్రతీ క్షణం ఓ మధుర జ్ఞాపకమే. కలిమి, లేమి లేకుండా కలివిడిగా తిరిగిన ఆ రోజులను తలుచుకుంటే.. తెలియని భావోద్వేగ వర్షంలో తడిసిపోతారు. తాజాగా ఓ స్కూల్ పిల్లల గుంపు నెటిజన్లకు అదే అనుభూతిని పంచారు. వర్షంలో ఒకే గొడుగు రక్షణగా చేసుకున్న ఆరుగురు పిల్లలు కేరింతలు కొడుతూ స్కూల్ నుంచి ఇంటికి నడిచి వెళ్తున్న వీడియో ప్రతీ ఒక్కరికి తమ చైల్డ్‌హుడ్‌ను గుర్తుచేస్తోంది.
వీడియో విషయానికొస్తే.. ఉల్లాసంగా కనిపిస్తున్న ఆరుగురు చిన్న పిల్లలు ఒకే గొడుగు కింద దూరి, వర్షపు చినుకుల మధ్య రోడ్డు పక్కగా నడుస్తున్నారు. వారిలో ముగ్గురు స్కూల్ యూనిఫామ్ ధరించి ఉండగా, ఒక చిన్న పిల్లోడు స్లేట్ పట్టుకొని అమాయకపు చూపులు, స్వచ్ఛమైన నవ్వుతో మెరుస్తున్నాడు. ఈ వీడియో నెటిజన్లకు తమ బాల్యాన్ని గుర్తుచేయగా.. చిన్ననాటి జ్ఞాపకాల దొంతరను కళ్ల ముందు పరిచింది. ఇక ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన IAS అధికారి అవనీష్ శరణ్.. 'దోస్త్' క్యాప్షన్‌తో పోస్టు చేశారు.
ఈ వీడియోపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్న నెటిజన్లు.. 'జీవితంలో బాల్యం చాలా సరదాగా ఉంటుంది, శరీరం తడిసినా మనసు తడవదు, మేము కలిసి చదువుతాము కలిసి ఆడతాం, ఈ నవ్వు మీకు మున్ముందు వస్తుందో లేదో ఎవరికి తెలుసు కానీ గుర్తుంచుకుంటారు' అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు వారి ముఖాల్లోని అమాయకత్వం, ఆనందం అమూల్యమైనది.. దీన్నే బాల్యం అంటారని కామెంట్ చేస్తున్నారు.
दोस्त.❤️ pic.twitter.com/JvbjRurKO5
— Awanish Sharan (@AwanishSharan) July 2, 2022






