చుక్కలు చూపించిన కోతులు.. టూరిస్టులు పరుగో పరుగు

by Dishanational1 |
చుక్కలు చూపించిన కోతులు.. టూరిస్టులు పరుగో పరుగు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల, రెండు కోతులు పర్యాటకులపై దాడి చేశాయి. అనంతరం వారిని తరిమికొట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జిబ్రాల్టర్‌లోని ఒక పర్యాటక ప్రదేశంలో పర్యాటకులు మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే, వారిపై ఓ కోతి దాడి చేసింది. దానిని అడ్డుకోబోయిన మరో మహిళపైకి కూడా దూసుకొచ్చింది. ఆ వెంటనే మరో కోతి కూడా వచ్చి వారిద్దరిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆ పర్యాటకులు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా పోస్టులు పెడుతున్నారు.



Next Story

Most Viewed