6 నెలల్లో విజయ్ ప్రభుత్వం పడిపోయి డీఎంకే ప్రభుత్వ వస్తుంది: ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్

by Malleboina Mahesh |

సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 6 నెలల్లోనే కూలిపోతుందని డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అన్నారు. స్టాలిన్‌ను ఓడించిన ఓటర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

6 నెలల్లో విజయ్ ప్రభుత్వం పడిపోయి డీఎంకే ప్రభుత్వ వస్తుంది: ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే.. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో చిన్నాప్టీలతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్ కు.. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలకు బిగ్ షాక్ ఇస్తున్నాయి. కొత్తగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన టీవీకే (TVK) అధినేత విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే (DMK) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని, కేవలం ఆరు నెలల్లోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. త్వరలోనే డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓడిపోయిన స్టాలిన్.. త్వరలోనే అసెంబ్లీకి తిరిగి రావాలని పార్టీ కోరుకుంటోందని, సీఎం విజయ్ వదులుకున్న 'తిరుచ్చి ఈస్ట్' నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్టాలిన్ పోటీ చేయాలని తాము ఆశిస్తున్నట్లు రాధాకృష్ణన్ వెల్లడించారు. ఇదే సమయంలో కొలత్తూరు నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొలత్తూరు నియోజకవర్గాన్ని స్టాలిన్ ఒక సింగపూర్‌లా మార్చినప్పటికీ, అలాంటి గొప్ప నాయకుడిని ఓడించారని అక్కడి ఓటర్లపై ఆయన తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఓటర్లను 'పనికిరాని వాళ్లు గా అభివర్ణించడం తో సామాన్య ప్రజలు, ప్రత్యర్థి పార్టీల నుంచి ఆయనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Next Story