- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఫ్యాన్స్‌పై విజయ్ ఫైర్
దిశ, సినిమా : జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పనిలేదంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.

దిశ, సినిమా : జీవితంలో ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పనిలేదంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మామనిదన్'. ఈ మూవీ చూసిన అభిమానుల్లో కొంతమంది తనకు ఫోన్ చేసి అనేక డౌట్లు అడిగారని, వాటన్నింటికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరంలేదని భావించి రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు. అలాగే సినిమా అన్నాక సహజంగా కొన్ని లోటుపాట్లు ఉంటాయని, వాటిని లాజిక్‌గా చూడకూడదని సూచించాడు. దర్శకుడు చెప్పదలచుకున్న స్టోరీని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాడా? లేదా? అనే కోణంలోనే చూడాలన్న హీరో.. 'ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితాలకు అద్దంపట్టేలా ఉంది. కానీ కొన్ని విషయాలనే పాయింట్ అవుట్ చేసి విమర్శించడం సరైంది కాదు' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. చివరగా 'మామనిదన్' సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు.






