- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Sethupathi: విద్యార్థులకు మంచి సలహాలిచ్చిన విజయ్ సేతుపతి
డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డారు హీరో విజయ్ సేతుపతి.

దిశ, వెబ్‌డెస్క్: డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డారు హీరో విజయ్ సేతుపతి. ఈ నటుడు కేవలం తమిళంలోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించి.. జనాల్ని మెప్పిస్తున్నాడు. శీను రామసామి దర్శకత్వంలో తేన్మేర్కు పరువు కాట్రు లో మొదటిసారిగా నటించారు. తర్వాత విజయ్ పంచామృతం, మరుదవేలు, అందవ కానోం, ఆరెంజ్ మిట్టై, హలో నాన్ పేయ్ పెసురెన్, వాయ్‌మై, అట్టి, కట్టప్పావ కనోం, ఇప్పడై వెల్లుమ్, తిరుట్టు పయలే 2, కాతిరుప్పోర్ పట్టియల్, పీపాసి, జుంగా, మెర్కు తొడార్చి మలై, ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం, అవెంజర్స్: ఎండ్‌గేమ్, కులసామి వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
హీరో విజయ్ సేతుపతి. ఇకపోతే ఈ హీరో తాజాగా ఓ కళాశాల కార్యక్రమంలో స్టూడెంట్స్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో పిల్లలకు పలు సలహాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో చూసే ప్రతి ఒక్కదాన్ని అస్సలు నమ్మవద్దు అని చెప్పారు. ఎప్పుడైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి.. ముందడుగు వేయాలని అన్నారు. సమయం వృథా చేసుకోకుండా.. సద్వినియోగం చేసుకోవాలని, టైమ్ ఎంతో విలువైనదని తెలిపారు. కానీ చాలా మంది గడిచిన తర్వాతే దాన్ని విలువను తెలుసుకుంటారని వెల్లడించారు. కాగా జీవితం చాలా గొప్పదని.. సంతోషంగా జీవించండి అని చెప్పారు.
ఈ సందర్భంగా అజిత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి మాట్లాడారు. చాలా రోజుల కిందట అజిత్ తో కలిసి నటించే చాన్స్ వచ్చిందని.. కానీ పలు కారణాల ఆ మూవీ పట్టాలెక్కలేదని వెల్లడించారు. అలాంటి గొప్ప నటుడితో కలిసి నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని.. నేను కూడా ఆ చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు నా కెరీర్ లో ఏది ప్లాన్ చేసుకోలేదని, వచ్చిన ఛాన్సులనే ఉపయోగించుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






