- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Mallya: ఆర్సీబీ విక్రయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
ఆర్సీబీ రికార్డు స్థాయి విక్రయంపై విజయ్ మాల్యా స్పందన. నాడు తన పెట్టుబడిని చూసి నవ్విన వారికి రూ. 16,500 కోట్ల డీల్‌తో సమాధానం దక్కిందని భావోద్వేగపూరిత పోస్ట్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్టుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్ వరకు ఆ జట్టు కప్ కొట్టలేదనే ఇక అపవాదు ఉండగా.. 2025 లో కప్ గెలిచి అందరి నోర్లు ముయించింది. అనంతరం 2026 సీజన్ ముందు ఎవరూ ఉహించని విధంగా.. ఆర్సీబీని కొత్త యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సరికొత్త రికార్డు సృష్టించడంపై ఆ జట్టు మాజీ అధినేత విజయ్ మాల్యా స్పందించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ (Ditya Birla Group) నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన నేపథ్యంలో విజయ్ మాల్యా (Vijay Mallya) సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
"2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు నేను రూ. 450 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాను. అప్పట్లో చాలా మంది నన్ను చూసి నవ్వారు. అదొక పనికిరాని 'వ్యానిటీ ప్రాజెక్ట్' అని విమర్శించారు. కానీ, నాటి రూ. 450 కోట్ల పెట్టుబడి నేడు రూ. 16,500 కోట్లకు పెరగడం చూస్తుంటే గర్వంగా ఉంది" అని మాల్యా రాసుకొచ్చారు. విమర్శల నుంచి రికార్డు స్థాయి విలువ వరకు ఆర్సీబీ ప్రయాణం అద్భుతమని కొనియాడిన ఆయన, "ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో ఒక భాగంగానే ఉంటుంది" అంటూ జట్టుపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.






