- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుదుచ్చేరిలో విజయ్ ఎన్నికల శంఖారావం.. మాది క్లీన్ గవర్నెన్స్ స్పీచ్
పుదుచ్చేరిలో విజయ్ ఎన్నికల హోరు! ప్రత్యర్థి కూటములపై 'కన్ఫ్యూజ్డ్', 'టైర్డ్' అంటూ ఘాటు విమర్శలు. రాష్ట్ర హోదా సాధనే టీవీకే లక్ష్యమని ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న క్రమంలో టీవీకే విజయ్ (TVK Vijay) ఎన్నికల శంఖారావం పూరించారు. శనివారం తట్టంచావడిలో జరిగిన భారీ ఎన్నికల బహిరంగ సభలో టీవీకే అధినేత విజయ్ ప్రత్యర్థి కూటములపై విమర్శనాస్త్రాలు సంధించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల బరిలో టీవీకే తొలిసారిగా దిగుతోందని, ఇక్కడి ప్రజలకు మార్పు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ అనేది ఒక 'కన్ఫ్యూజ్డ్' (అయోమయ) కూటమి అని, పుదుచ్చేరిలోనూ అదే అయోమయం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. మరోవైపు, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమిని 'టైర్డ్' (అలసిపోయిన) కూటమిగా అభివర్ణిస్తూ, వారి మధ్య ఐక్యత లేదని విమర్శించారు.
కేంద్రంలోనూ, ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ-ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి పుదుచ్చేరికి ఎందుకు 'ప్రత్యేక రాష్ట్ర హోదా' (Statehood) కల్పించలేదని విజయ్ ప్రశ్నించారు. టీవీకే అధికారంలోకి వస్తే రాష్ట్ర హోదా సాధన కోసం 100% న్యాయపరమైన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు కూటములకు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని, పుదుచ్చేరికి మంచి పాలన అవసరమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో టీవీకే జెండా ఎగురవేయడం ఖాయమని, అదే తరహాలో పుదుచ్చేరిలోనూ తన పార్టీ పాలన రావాలని, ప్రజలు 'విజిల్' గుర్తుకు ఓటేసి 'వన్ ఫింగర్ రివల్యూషన్' తీసుకురావాలని విజయ్ పిలుపునిచ్చారు.






