అదిరిపోయిన విజయ్ దేవరకొండ 'రణబాలి' గ్లింప్స్

by Muthe.Rajitha |   (  Updated:2026-01-27 12:12:19  IST  )

హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'టాక్సీవాలా'.

అదిరిపోయిన విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'టాక్సీవాలా'. ఈ హిట్ కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కాబోతోంది. వీళ్ళ కొత్త సినిమా అధికారికంగా ఖరారవడమే కాదు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ వ్యూస్ వస్తున్నాయి. అంతేకాదు ఈ వీడియోతో ఈ చిత్ర టైటిల్‌ను కూడా ప్రకటించింది యూనిట్. ఈ పవర్‌ఫుల్ మూవీకి 'రణబాలి'(Ranabaali) అనే పేరును ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది 14వ సినిమా కాగా ఇందులో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోంది.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వొస్లు కీలక పాత్ర పోషిస్తుండగా.. అజయ-అతుల్ ద్వయం సంగీతం అందిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మేకర్స్, T- సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో జరిగిన కథ, అప్పటి ఆకృత్యాలు, ఆకలి చావులు, వీరోచితంగా ఉన్న విజయ్ గెటప్ సినిమాపై హై ఎక్సెప్టెషన్స్ పెంచేశాయి.

READ MORE ....

పూనకాలు లోడింగ్.. డబ్బింగ్ మైక్ పట్టుకోనున్న ఉస్తాద్

Next Story