ఆ స్టార్ డైరెక్టర్స్ విజయ్ దేవరకొండకు టైం ఇచ్చేనా ?

by Dishanational2 |
ఆ స్టార్ డైరెక్టర్స్ విజయ్ దేవరకొండకు టైం ఇచ్చేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్ :టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత రెండేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించడం లేదు. చివరగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ ఒక్క సినిమాలోనే నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం రెండు సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉండగా, ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఆగస్ట్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఛార్మి కౌర్ , కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ తదుపరి చిత్రం కూడా పూరి జగన్నాథ్తో చేస్తున్నాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన, ఇది మొదట సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో ఈ ప్రాజెక్ట్ తప్ప మరో సినిమా లేదు.

అయితే తాజాగా విజయ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవరకొండ ప్రస్తుతం వరస ప్రాజెక్ట్‌లతో బీజీగా ఉండటంతో ఏ సినిమాకు ఓకే చెప్పనట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్రాజెక్ట్‌లలో సుకుమార్, త్రివిక్రమ్‌వి కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆ స్టార్ డైరెక్టర్స్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బీజీగా ఉన్నారు. దీంతో విజయ్‌తో వర్క్ చేసే సమయం ఎప్పుడు వస్తుందో.. అప్పటి వరకు యంగ్ హీరో వేయిట్ చేస్తాడా లేక వేరే దర్శకులతో కలిసి పనిచేస్తారాఅనేది చూడాలి.



Next Story

Most Viewed