"క్రికెటర్ అవుతా.. సహాయం చేయండి అన్నా..!" విజయ్ అభిమాని కన్నీళ్లు

by Muthe.Rajitha |

టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండకు యువతలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది.

క్రికెటర్ అవుతా.. సహాయం చేయండి అన్నా..! విజయ్ అభిమాని కన్నీళ్లు
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండకు యువతలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది. ఇటీవల జరిగిన టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు టోర్నమెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ, హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో తన ఫేవరేట్ హీరోను అంత దగ్గరగా చూసిన ఓ యువ అభిమాని భావోద్వేగాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా భోరున కన్నీళ్లు పెట్టుకున్నాడు. "అన్నా.. నేను బాగా క్రికెట్ ఆడతాను, నాకు కొంచెం సపోర్ట్ చెయ్యి అన్నా" అంటూ సదరు అభిమాని ఏడుస్తూ విజయ్‌ను వేడుకున్నాడు.

తనను చూసి అంతలా ఏడుస్తున్న అభిమానిని గమనించిన విజయ్ దేవరకొండ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే అతన్ని గుండెలకు హత్తుకుని ఓదార్చారు. ఆ యువకుడి వివరాలు, అతని నేపథ్యం గురించి అడిగి తెలుసుకుని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. స్టార్ హీరో అయి ఉండి కూడా అభిమాని పట్ల చూపించిన ఈ మానవత్వానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా షేర్ అవుతూ, నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ కేవలం సినిమాల పరంగానే కాకుండా, ప్రతి ఏటా న్యూ ఇయర్ సందర్భంగా 'దేవరశాంటా' పేరుతో తన అభిమానులకు విలువైన కానుకలు ఇవ్వడం, అలాగే తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

Next Story