Today's Horoscope:12 రాశుల దినఫలాలు(జులై13-సోమవారం)

by Jakkula.Mamatha |

ఈ రోజు(సోమవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Todays Horoscope:12 రాశుల దినఫలాలు(జులై13-సోమవారం)
X

మేష రాశి

ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వృషభ రాశి

వీరికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలి. పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అవసరం. శాంతంగా వ్యవహరించడం శ్రేయస్కరం.

మిథున రాశి

ఇవాళ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు కలిసివచ్చే రోజు. రావలసిన బాకీలు వసూలవుతాయి. మిత్రుల నుంచి మంచి సహకారం అందుతుంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు వింటారు.

సింహ రాశి

ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తోటివారితో మాట్లాడేటప్పుడు సహనం వహించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి.

కన్యా రాశి

ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి.

తుల రాశి

ఈ రోజు చాలా అనుకూలం. భాగస్వామ్య వ్యాపారాలు కలసివస్తాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఇవాళ శుభప్రదం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, ఉద్యోగార్థులకు మంచి సమయం. శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకోని ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి

ఈ రోజు వీరికి సాధారణంగా గడుస్తుంది. సంతాన విషయంలో కొన్ని విషయాలు ఆలోచింపజేస్తాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి

ఇవాళ మకర రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి, వాహన కొనుగోలు విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో చిన్నపాటి సమస్యలు రావచ్చు, కానీ సులువుగా సర్దుమణుగుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుంభ రాశి

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులు, మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. స్వల్ప ప్రయాణాలు కలసివస్తాయి. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు బాగుంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు.

మీన రాశి

ఈ రోజు ఈ రాశి వారికి మధ్యస్థ అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

Next Story