- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుని కుంటకు కబ్జాల కాటు.. నిర్మాణదారులపై చర్యలేవి ?
శేరిలింగంపల్లి మండలంలో ఒక్కో చెరువు దుస్థితి ఒక్కోరకంగా ఉంటుంది. ఆక్రమణల రూపం వేరైనా కబ్జాలు జరిగి తీరాల్సిందే అంటున్నారు ఆక్రమణదారులు.

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలంలో ఒక్కో చెరువు దుస్థితి ఒక్కోరకంగా ఉంటుంది. ఆక్రమణల రూపం వేరైనా కబ్జాలు జరిగి తీరాల్సిందే అంటున్నారు ఆక్రమణదారులు. ఇందులో దేవుని కుంటకు మినహాయింపు లేదు. గోపన్‌పల్లిలోని పురాతన రంగనాథ్ ఆలయానికి ఎదురుగా మేడ్ల కుంట (దేవుని కుంట) ఉంది. ఎగువ భాగం నుంచి కుంటలోకి నీటిని మోసుకు రావలసిన నీటి కాలువ అదృశ్యం కాగా.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలకు గురైంది. దిగువున ఉన్న అలుగు పారే ప్రాంతం ఆక్రమణకు గురైంది. ఆకృతి కన్‌స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అక్రమంగా కాలువ ఆక్రమించారని ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేకులు ఏర్పాటు చేసి స్వాధీనంలో ఉంచుకున్నారు. అలుగు నుంచి నీరు పారే కాలువ ధ్వంసం చేశారని, కుదించిన కాలువను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నోటీసులు జారీ చేసినా..
కుంట అలుగు ప్రాంతంలో ఇనుప రేకులు ఏర్పాటు చేసి ఆక్రమిస్తున్న విషయం ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించినా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. సీఎంసీ శేరిలింగంపల్లి అధికారులు ఫిర్యాదులపై స్పందించడం లేదు. ఇరిగేషన్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. చెరువు అదనపు నీటి కాలువను (అవుట్‌లెట్) అక్రమంగా కుదిస్తున్నట్లు గుర్తించారు. అదనపు నీటి కాలువ, దాని బఫర్ జోన్‌ను మట్టితో నింపి అనధికారిక షెడ్లను నిర్మించడం ద్వారా సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నారని, శాటిలైట్ ఫొటోగ్రాఫిక్ ఆధారాలు నమోదు చేసినట్లు హైడ్రా, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. హుస్సేన్ సాగర్ సరస్సు విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం మల్లేశ్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్‌కు లేఖ సంఖ్య: ఈ/హెచ్ఎస్ఎల్డీ/ హెడ్‌డీ/ ట్యాంక్స్ ఎన్ క్రాచిమెంట్/ 2026/269/ 05.02.2026న లేఖ రాశారు. డీఈఈ/ఎస్డీ-II లేఖ సంఖ్య ఈఈ/ఎస్డీ/II/ హెచ్ఎస్ఎల్డీ/2026/ మేడ్లకుంట ఎన్ క్రాచిమెంట్/ 99,తేదీ 29.01.2026న హైడ్రాకు లేఖ రాశారు.
కాలువను బఫర్ జోన్ మట్టితో నింపినా..
దేవుని కుంట కాలువ బఫర్ జోన్‌ను మట్టితో నింపి అనధికారిక షెడ్లను నిర్మించడం ద్వారా సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. జల వనరుల పక్కన నిర్మాణాలకు అనుమతి ఇచ్చినప్పుడు నిబంధనలు పాటిస్తున్నారో లేదో చూడాల్సిన సీఎంసీ శేరిలింగంపల్లి జోన్ అధికారులు పట్టించుకోవడం లేదు. అలుగు సహజ నీటి ప్రవాహం పునరుద్ధరించి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రంగనాథ్ స్వామి భక్తులు కోరుతున్నారు. ప్రతి ఏటా దేవుని ఉత్సవాల సమయంలో స్వామి స్నానం ఆచరించే కోనేరు కనుమరుగు అయ్యింది.






