'లెనిన్' ముందు భారీ ఛాలెంజ్.. గెలిస్తే తిరుగే లేదు

by Pulgam srinivas |

వీకెండ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'లెనిన్'కు నేటి తొలి వర్కింగ్ డే కలెక్షన్లు కీలకంగా మారాయి.

లెనిన్ ముందు భారీ ఛాలెంజ్.. గెలిస్తే తిరుగే లేదు
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమే అయినప్పటికీ, ఆయనకు ఇప్పటివరకు ఆశించిన స్థాయి విజయాన్ని అందించే సినిమా దక్కలేదు. అలాంటి సమయంలోనే 'ఏజెంట్' తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజే మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఆ తర్వాత శని, ఆదివారాల సెలవులను సద్వినియోగం చేసుకుని మరింత మెరుగైన కలెక్షన్లు నమోదు చేసింది. వీకెండ్ ముగిసే నాటికి 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లతో అఖిల్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే సంకేతాలు కనిపించాయి.

అయితే ఈ సినిమాకు అసలైన పరీక్ష సోమవారం నుంచే ప్రారంభం కానుంది. విడుదల తర్వాత వచ్చిన తొలి వర్కింగ్ డే కావడంతో, ఈ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీని నమోదు చేస్తే 'లెనిన్' బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి తొలి వీక్‌డేలో ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. శివాజీ, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

Next Story