జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వీడియో

by Mallepaka Hamsa |

ఈ ఎన్నికల నిర్వహణపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో గొడవ మరింత ముదిరింది.

జానీ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కొరియేగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలతపై డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అసోసియేషన్‌కి చెందిన పదిమంది డాన్సర్ల తమ పదవులు రాజీనామా చేయడే కాకుండా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. తమకు అన్యాయం జరుగుతోందని, అసోసియేషన్‌లో రూల్స్ అతిక్రమిస్తున్నారని డాన్సర్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ వివాదం నేపథ్యంలో, ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య ఇంతటి విభేదాలు రావడానికి డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని ఎన్నికల సభ్యత్వ అంశాలే కారణమని తెలుస్తోంది. ఫెడరేషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే, అసోసియేషన్‌లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై ఈ వివాదం మొదలైంది.

ఈ ఎన్నికల నిర్వహణపై జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో గొడవ మరింత ముదిరింది. ఇదే సమయంలో సుమలత తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఆ పదిమంది డ్యాన్సర్లు తమ సభ్యత్వాలను వదులుకున్నారు. ఈ గొడవపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న వీరిద్దరి మధ్య ఇలాంటి గొడవ జరగడంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదం కారణంగా భవిష్యత్తులో వీరిద్దరికీ వచ్చే సినిమా అవకాశాలు కూడా తగ్గే ప్రమాదం ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతోంది.

Next Story