- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > తూర్పుగోదావరి > కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ధవళేశ్వరం కొత్తగేట్ల నిర్మాణ పనుల ప్రారంభం
కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ధవళేశ్వరం కొత్తగేట్ల నిర్మాణ పనుల ప్రారంభం
by Naga Rani Yarlagadda |
సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పుగోదావరిలోని కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు నేడు తూర్పుగోదావరిలోని కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ కొత్త గేట్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్లను మార్చి.. వాటి స్థానంలో కొత్త గేట్ల పనులను ప్రారంభించనున్నారు. కొత్తగేట్ల పనుల కోసం ప్రభుత్వం రూ.152.95 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పిచ్చుకలంకలో రైతులతో సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అలాగే ప్రభుత్వం నుంచి అందించే సహాయంపై అభిప్రాయం సేకరించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. పోలవరం ప్రధాన డ్యామ్, విద్యుత్ కేంద్రం, నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక సీఎం చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించనున్నారు.
Next Story






