- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానలు కురవాలని వినూత్న పూజలు.. చింతపల్లిలో వెలుగులోకి వచ్చిన పాత సంప్రదాయం!
వర్షాలు ఆలస్యమవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్న వేళ ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో చిన్నారులు నిర్వహించిన వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

దిశ, ఖమ్మం రూరల్: వర్షాలు ఆలస్యమవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్న వేళ ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో చిన్నారులు నిర్వహించిన వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. గ్రామంలో మంచి వర్షాలు కురవాలని కోరుకుంటూ కప్పతో ఊరేగింపు నిర్వహించి వరుణదేవుడిని ప్రార్థించారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు కురవాలని కోరుతూ చిన్నపిల్లలు కప్పను ఊరేగిస్తూ ఇంటింటికి వెళ్లి నీళ్లు పోయించుకోవడం, వరుణదేవుడిని ప్రార్థించడం వంటి సంప్రదాయాలు ఉండేవి.
కాలక్రమేణా కనుమరుగైన ఆ ఆచారాన్ని చింతపల్లి చిన్నారులు మళ్లీ గుర్తు చేశారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంటల సాగు ఇబ్బందుల్లో పడటంతో గ్రామంలోని చిన్నారులు స్వచ్ఛందంగా కప్పతో గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తూ వానలు కురవాలని ప్రార్థించారు. చిన్నారుల అమాయకత్వం, ప్రకృతిపై వారి నమ్మకం గ్రామస్తులను భావోద్వేగానికి గురి చేసింది. వారి ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తూ, వరుణదేవుడు కరుణించి త్వరలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.






