విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నిరుపేద ఇల్లు దగ్ధం.. రోడ్డున పడ్డ కుటుంబం!

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని పకీర తండా గ్రామ శివారు బంజరలో ఘోర ప్రమాదం సంభవించింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నిరుపేద ఇల్లు దగ్ధం.. రోడ్డున పడ్డ కుటుంబం!
X

దిశ,డోర్నకల్: మండల పరిధిలోని పకీర తండా గ్రామ శివారు బంజరలో ఘోర ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ నిరుపేద ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ దురదృష్టకర సంఘటనలో సుమారు 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సర్వస్వం కాలి బూడిద..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండల పరిధి పకీర తండా శివారు బంజారకు చెందిన నల్లగట్ల వెంకన్న కుటుంబం నిత్యం కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది. సాయంకాల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు, స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో పాటు, నిత్యావసర సరుకులు, బట్టలు, సర్టిఫికెట్లు, గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. కంటి ముందే తమ సర్వస్వం కాలిపోవడంతో బాధితుడు వెంకన్న కుటుంబం లబోదిబోమంటూ ఆవేదన చెందుతోంది.

Next Story