- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'శ్రీనివాస మంగాపురం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఫిక్స్
'శ్రీనివాస మంగాపురం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు జయకృష్ణ ఘట్టమనేని ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమాలో రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తుండగా, అశ్వినీ దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ స్థాయిలో ఈవెంట్‌ను కూడా నిర్వహించారు.
కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారనే ఆసక్తి చాలా రోజులుగా అభిమానుల్లో నెలకొంది. జయకృష్ణ, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు కావడంతో, మహేష్ బాబు ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ, 'శ్రీనివాస మంగాపురం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తన బాబాయ్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ప్రకటించారు. దీంతో ఈ ఈవెంట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.






