ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్.. ఆ సినిమా నుంచే 'బీస్ట్'..

by Dishafeatures2 |
ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్.. ఆ సినిమా నుంచే బీస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ 'బీస్ట్' ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 'మాస్టర్' మూవీలో క్లాసికల్‌మాస్ హీరోగా విజయ్ అందరినీ కట్టిపడేశాడు. అటువంటిది 'బీస్ట్'లో విజయ్ పక్కా యాక్షన్, మాస్ హీరోగా కనిపించనున్నాడు. దీంతో ఇందులో విజయ్ నెవ్వర్ బిఫోర్ యాంగిల్‌లో కనిపించనున్నాడని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా కథను 2009లో వచ్చిన హాలీవుడ్ 'పాల్ బ్లార్ట్: మాల్ కాప్' మూవీ అధారంగా రాసుకుందని తెలిపారు. 'బీస్ట్' సినిమాకు హాలీవుడ్ సినిమాకు అనేక పోలికలు ఉన్నాయని చెప్పారు. మాల్ కాప్ సినిమా ఓ బిజీగా మాల్‌లో ఓ గ్యాంగ్ తన ఆధీనంలోకి తీసుకుంటుంది, ఆ మాల్‌ని ఓ సెక్యూరిటీ గార్డ్ ఎలా కాపాడన్నది కథ. అదే విధంగా విజయ్ 'బీస్ట్‌' మూవీలో ఓ మాల్‌ను తీవ్రవాదులు దాడి చేస్తారు. దాని నుంచి అందరినీ ఎలా కాపాడాడనేది కథ. మరి మేకర్స్ 'బీస్ట్' మూవీని ఎలాంటి ట్విస్ట్‌లతో ప్లాన్ చేశారో చూడాలి.



Next Story

Most Viewed