ఏడడుగులకు సిద్ధం.. 'విరోష్' పేరుతో విజయ్, రష్మిక సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అభిమానులు పెట్టిన 'విరోష్' పేరుతోనే తమ బంధాన్ని ప్రకటించారు. ప్రస్తుతం వారి స్టోరీలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఏడడుగులకు సిద్ధం.. విరోష్ పేరుతో విజయ్, రష్మిక సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా రహస్యంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు.. ఇటీవలే పెళ్లికి సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. తమ వివాహంపై ఇద్దరు అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. కానీ ఆదివారం రాత్రి, విజయ్, రష్మికలు ఇన్‌ష్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. తమ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన ప్రకటనను పోస్ట్ చేశారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే "విరోష్" (VIROSH) పేరునే తమ బంధానికి అధికారిక నామకరణంగా మారుస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. వారు తమ స్టోరీలో.. "మా ప్రియమైన వారికి.. మేము ఎటువంటి ప్రణాళికలు వేసుకోక ముందే, మా గురించి మేము ఏమీ నిర్ణయించుకోకముందే.. మీరు అక్కడ ఉన్నారు" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టారు.

అభిమానులు తమపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ వివాహ బంధాన్ని "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" (The Wedding of VIROSH) గా పిలుచుకుంటామని విజయ్, రష్మిక ప్రకటించారు. "మీరు మాకు ఒక పేరు ఇచ్చారు.. మమ్మల్ని విరోష్ అని పిలిచారు.. అందుకే ఈ రోజు పూర్తి హృదయంతో మా కలయికకు మీ గౌరవార్థం ఆ పేరునే పెడుతున్నాం" అంటూ వారి పోస్ట్‌లో పేర్కొన్నారు. రష్మిక మందన్నతో తన బంధాన్ని పరోక్షంగా ధృవీకరిస్తూనే, ఈ వివాహ వేడుకలో అభిమానులను కూడా భాగస్వాములను చేస్తున్నట్లు విజయ్ సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Next Story