- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్ వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్

దిశ, వెబ్ డెస్క్: వాట్సాప్ వెబ్ యూజర్లకు మెటా సంస్థ (Meta organization) గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న మొన్నటి వరకు కేవలం ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న వీడియో, ఆడియో గ్రూప్ కాల్స్ ఫెసిలిటీ తాజాగా వాట్సాప్ వెబ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ తాజా అప్ డేట్ తో అందుబాటులోకి రానుంది. వెబ్ వర్షన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కొత్త సదుపాయాలు.. ఫిబ్రవరి 10వచ్చే తాజా అప్‌డేట్స్ ప్రకారం, ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ బీటా ప్రోగ్రామ్ (WhatsApp Web Beta Program)లో ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల వినియోగదారులు తమ కంప్యూటర్లలో ప్రత్యేకంగా డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే, నేరుగా క్రోమ్ లేదా ఫైర్‌ఫాక్స్ వంటి వెబ్ బ్రౌజర్ల ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.
ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా, వీడియో కాల్స్ సమయంలో వినియోగదారులు తమ స్క్రీన్‌ను ఇతరులకు షేర్ చేసే 'స్క్రీన్ షేరింగ్' ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇది ఆఫీస్ మీటింగ్స్- ప్రెజెంటేషన్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత చాట్స్ (One-on-One)కు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే గ్రూప్ కాల్స్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని సమాచారం. మొబైల్ కాల్స్ లాగానే ఇవి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా పూర్తి సురక్షితంగా ఉంటాయి.
ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్, రాబోయే కొన్ని వారాల్లో సాధారణ వినియోగదారులందరికీ దశలవారీగా విడుదల కానుంది. భవిష్యత్తులో ఈ వెబ్ కాలింగ్ ద్వారా సుమారు 32 మంది వరకు గ్రూప్ కాల్‌లో మాట్లాడుకునేలా, కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటి అదనపు ఫీచర్లను కూడా వాట్సాప్ జత చేయనుంది. ఇది ముఖ్యంగా లైనక్స్ (Linux) వినియోగదారులకు, సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేయడానికి ఇష్టపడని వారికి గొప్ప ఊరటనిచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.






