- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులం లెక్క తేలాల్సిందే : రెండో రోజు వీహెచ్ దీక్ష
దేశవ్యాప్త జనగణనలో ఓబీసీల కులగణనను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్త జనగణనలో ఓబీసీల కులగణనను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరింది. హైదరాబాద్ అంబర్‌పేటలోని తన నివాసంలో ఆయన ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. ఓబీసీలకు తగిన న్యాయం జరగాలంటే వారి జనాభా లెక్కలు ఖచ్చితంగా తేలాలని, అప్పటి వరకు తన పోరాటం ఆపనని ఆయన స్పష్టం చేశారు. దీక్షా శిబిరానికి ఆదివారం వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి వీహెచ్‌కు సంఘీభావం ప్రకటించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ యాదవ్, యాదగిరి శ్రీకాంత్ గౌడ్‌లతో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఆయనను కలిసి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం వీహెచ్ చేస్తోన్న పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిరవధిక దీక్ష నేపథ్యంలో అంబర్‌పేట పోలీస్ అధికారులు సందర్శించారు. వీహెచ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరసన ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వయసు రీత్యా ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కులగణనపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని వీహెచ్ అనుచరులు చెబుతున్నారు.






