- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్ట్ షాపులపై వేంపల్లి మహిళల పోరు.. ప్రధాన రహదారిపై బైఠాయింపు
గ్రామంలో మద్యం అమ్మవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరా.. మా కుటుంబాలు రోడ్డున పడాల్సిందేనా.. అంటూ సిర్పూర్ మండలంలోని వేంపల్లి గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, కాగజ్‌నగర్: గ్రామంలో మద్యం అమ్మవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరా.. మా కుటుంబాలు రోడ్డున పడాల్సిందేనా.. అంటూ సిర్పూర్ మండలంలోని వేంపల్లి గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరిలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులు తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ, మహిళలంతా ఏకమై సిర్పూర్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రహదారిపై బైఠాయించి బెల్ట్ షాపుల నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రధాన రహదారిపై కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మాట్లాడుతూ.. గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల మద్యం ఏరులై పారుతోందని, యువత, కూలీలు మద్యానికి బానిసలై ఇళ్లను గుల్ల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే తామంతా కలిసి గ్రామంలో మద్యం అమ్మవద్దు అని హెచ్చరించినప్పటికీ, బెల్ట్ షాపుల నిర్వాహకులు కొద్దిరోజులు ఆగి, మళ్లీ యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. నిర్వాహకుల మొండివైఖరి నచ్చకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి, ఊరిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.






