- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణ్‌కు తీవ్ర గాయం..అది అత్యంత భయంకరమైన నొప్పి అంటూ షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్(Varun Dhawan) ‘బోర్డర్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్(Varun Dhawan) ‘బోర్డర్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకున్నారు. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన ‘బోర్డర్’సీక్వెల్‌గా వచ్చి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు 1971 నాటి భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా వచ్చి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. 1971 యుద్ధ సమయంలో పాకిస్థాన్ దురాక్రమణలను తిప్పికొట్టేలా, వాయు, భూతల దళాల పరాక్రమాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో తనకు తీవ్ర గాయం అయినట్లు తెలుపుతూ ఓ షాకింగ్ వీడియోను షేర్ చేశాడు. బోర్డర్-2 (Border-2)షూటింగ్ సమయంలో తనకు తగిలిన అత్యంత తీవ్రమైన గాయం అని తెలుపుతూ.. కెమెరాకు తగలకుండా తప్పించుకునే ప్రయత్నంలో నా వెన్నెముక కింది భాగాన్ని ఒక రాయికి బలంగా కొట్టుకున్నట్లు వెల్లడించాడు.
ఆ గాయం వల్ల తన జీవితంలో అత్యంత తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యాడు. అది తన వెన్నెముక కింది భాగంలో హెయిన్‌లైన్ ఫ్రాక్చర్ అయిందని.. దాని నుంచి వరుణ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపాడు. గాయం అయిన సమయంలో కనీసం నడవలేకపోయినట్లు.. కానీ ఆ సమయంలో.. తన టీమ్ అంతా తనకు సాయం చేయడంతో షూటింగ్ కంప్లీట్ చేశానని.. తన బృందానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక వీడియోలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్ యాక్షన్ సీన్‌కు సంబంధించిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సన్నీ డియోల్,దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా, అన్య సింగ్, అనురాగ్ అరోరా కీలక పాత్రలో నటించి మెప్పించారు. టీ సిరీస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.






