- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి సినిమాలే చేయాలనుంది.. 'బద్లాపూర్'పై వరుణ్ ప్రశంసలు
దిశ, సినిమా : మాస్ సినిమాల్లో నటించడమే కంఫర్టబుల్‌గా ఉంటుందని యంగ్ హీరో వరుణ్ ధావన్ అభిప్రాయపడ్డాడు.

దిశ, సినిమా : మాస్ సినిమాల్లో నటించడమే కంఫర్టబుల్‌గా ఉంటుందని యంగ్ హీరో వరుణ్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం నితేష్ తివారి దర్శకత్వంలో 'బవాల్' సినిమా చేస్తున్న ఆయన రీసెంట్‌గా మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వీలైనంత వరకు మాస్ ఎంటర్‌టైనర్స్ చేసేందుకే మొగ్గు చూపుతానన్న హీరో.. సుజిత్ సర్కార్, నితేష్ తివారీ, శ్రీరామ్ రాఘవన్ వంటి దర్శకులతో పనిచేయడం తన ఎదుగుదలకు సాయపడిందని తెలిపాడు. ఇక అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న 'భేడియా' వంటి మరిన్ని చిత్రాలు చేయాలనుందని తెలిపాడు వరుణ్. కౌశిక్‌తో కలిసి పనిచేయడం బాగుందంటూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు పొందిన 'బద్లాపూర్' తరహా మూవీస్‌లో నటించడాన్ని కంఫర్టబుల్‌గా ఫీలవుతానని, భవిష్యత్తులో చేయబోయే పాత్రలెప్పుడూ గతానికంటే భిన్నంగా ఉండాలనే కోరుకుంటున్నానని తెలిపాడు.






