- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణ్ చక్రవర్తి 'మిస్టరీ' ఇక పనిచేయదు.. కేకేఆర్ బౌలింగ్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 ముందు వరుణ్ చక్రవర్తి ఫామ్‌పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్. కేకేఆర్ బౌలింగ్‌లో పస తగ్గిందని, వరుణ్ మిస్టరీని బ్యాటర్లు ఛేదించేశారని విశ్లేషణ.

దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభం కానున్న క్రమంలో మిస్టీరియస్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పై రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలింగ్ విభాగంపై షాకింగ్ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కేకేఆర్ (KKR) ప్రధాన అస్త్రం వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో గతంలో ఉన్న ‘నవ్యత’ (Novelty factor), ప్రత్యర్థుల్లో ఉన్న భయం ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయని ఈ సందర్భంగా అశ్విన్ విశ్లేషించారు.
ఒకప్పుడు వరుణ్ బౌలింగ్ (Varun bowling)ను అర్థం చేసుకోవడానికి బ్యాటర్లు తలమునకలయ్యేవారని, కానీ టీ20 ప్రపంచకప్ రెండో సగంలో అతను భారీగా పరుగులు సమర్పించుకోవడాన్ని బట్టి చూస్తే, అతని ‘మిస్టరీ’ని బ్యాటర్లు ఛేదించినట్లు కనిపిస్తోందని అశ్విన్ పేర్కొన్నారు. వరుణ్ తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడని, తన బౌలింగ్‌ను మళ్ళీ మెరుగుపరుచుకోకపోతే ఈ సీజన్‌లో కేకేఆర్‌కు కష్టాలు తప్పవని అశ్విన్ హెచ్చరించారు. అలాగే కేకేఆర్ జట్టు కూర్పుపై కూడా అశ్విన్ పెదవి విరిచారు.
ముస్తాఫిజుర్ రెహమాన్ అందుబాటులో లేకపోవడం, మతీషా పతిరానా గాయపడటం, హర్షిత్ రాణా దూరం కావడం వంటి కారణాలతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ బలహీనపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. జింబాబ్వే పేసర్ ముజారబానీ రాక సానుకూల అంశమే అయినప్పటికీ, జట్టులో కీలక బాధ్యతను భుజాన వేసుకునే బౌలర్ ఎవరూ కనిపించడం లేదని విమర్శించారు. అంతేకాకుండా, గతంలో జట్టుకు కప్పు అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్ళిపోవడం కోల్‌కతాకు పెద్ద దెబ్బని, ఈసారి కేకేఆర్ నినాదంలో ‘జీత్బో’ (గెలవడం) అనే ధీమా కనిపించడం లేదని అశ్విన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.






