నవాబుపేట నూతన ఎస్సైగా వాకిటి నరేందర్ బాధ్యతలు స్వీకరణ

by Jakkula.Mamatha |

నవాబుపేట మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దుతానని నూతన ఎస్సై వాకిటి నరేందర్ అన్నారు.

నవాబుపేట నూతన ఎస్సైగా వాకిటి నరేందర్ బాధ్యతలు స్వీకరణ
X

దిశ,నవాబుపేట: నవాబుపేట మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దుతానని నూతన ఎస్సై వాకిటి నరేందర్ అన్నారు. ఆదివారం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్రమార్కులను ఉద్దేశించి ఎస్సై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఫిల్టర్ ఇసుక తయారీ, అక్రమ ఇసుక రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణ, అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

రాత్రి గస్తీని పటిష్టం చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో 24/7 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని, అవినీతి రహితంగా, పారదర్శకంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ రక్షక దళాలను యాక్టివ్ చేసి ప్రజల భాగస్వామ్యంతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎస్సై నరేందర్ మండల ప్రజలకు భరోసా ఇచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది ఎస్సైకి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story