- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttam: జానారెడ్డిని పరామర్శించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి..
రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరిగి వెళ్లే క్షణంలో ఉత్తమ్‌ను జానారెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సెండాఫ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్‌గా ఉన్న జానారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక మంత్రి పదవులు కొనసాగుతూ ఆయా ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు. మరోవైపు జానారెడ్డి త్వరలోనే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుకుంటున్నాయి.






