- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ తో యుద్ధం.. అమెరికాకు రూ. 2.50 లక్షల కోట్ల ఖర్చు
ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక ఆపరేషన్ కోసం అగ్రరాజ్యం భారీ స్థాయిలో నిధులను వెచ్చిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక ఆపరేషన్ కోసం అగ్రరాజ్యం భారీ స్థాయిలో నిధులను వెచ్చిస్తోంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అమెరికా సుమారు 25 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 2.30 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ యుద్ధ వ్యయానికి సంబంధించిన వివరాలను అమెరికా అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.
పెంటగాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ 25 బిలియన్ డాలర్ల వ్యయంలో అత్యధిక భాగం అత్యాధునిక ఆయుధ సామగ్రి, క్షిపణులు మరియు రక్షణ వ్యవస్థల కోసమే వెచ్చించినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే అమెరికా సుమారు 11 బిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కార్యకలాపాలను కొనసాగించడానికి అదనంగా 200 బిలియన్ డాలర్లకు పైగా నిధులను మంజూరు చేయాలని పెంటగాన్ ఇప్పటికే అమెరికా పార్లమెంటును కోరినట్లు సమాచారం.






