అమెరికా హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

by Malleboina Mahesh |

హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం! మార్చి 19 వరకు గడువు. కొత్తగా వేతన ఆధారిత లాటరీ పద్ధతి అమలు. ఏప్రిల్ నుంచి పిటిషన్ల దాఖలుకు ఛాన్స్

అమెరికా హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న FY 2027 కోటా హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 4, 2026 న అధికారికంగా ప్రారంభమైంది. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) ఈ రిజిస్ట్రేషన్ విండోను మార్చి 19 వరకు అందుబాటులో ఉంచింది. ఈసారి రిజిస్ట్రేషన్లలో అత్యంత కీలకమైన మార్పు చేశారు. పాత 'ర్యాండమ్ లాటరీ' పద్ధతి స్థానంలో కొత్తగా 'వేతన ఆధారిత ఎంపిక' (Wage-Based Weighted Selection) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఎంపికలో అదృష్టం కంటే దరఖాస్తుదారునికి ఆఫర్ చేసిన వేతన స్థాయికే (Wage Levels I-IV) ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం, అత్యధిక వేతనం (లెవల్ 4) పొందే అభ్యర్థుల దరఖాస్తులు లాటరీ పూల్‌లో నాలుగు సార్లు నమోదు చేయబడతాయి. తద్వారా వారి ఎంపిక అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో ప్రారంభ స్థాయి (లెవల్ 1) వేతనం ఉండే వారికి ఎంపిక అవకాశాలు కొంత తగ్గవచ్చు. ప్రతి దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా $215 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 19న గడువు ముగిసిన తర్వాత, మార్చి 31 నాటికి ఎంపికైన వారి వివరాలను USCIS వెల్లడిస్తుంది. విజేతలు ఏప్రిల్ 1 నుండి జూన్ 30 లోపు పూర్తి స్థాయి వీసా పిటిషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

Next Story